రాత్రి మామ, అల్లుడి మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి

by GSrikanth |
రాత్రి మామ, అల్లుడి మధ్య ఘర్షణ.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండెనెమలిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల్లో భాగంగా శుక్రవారం రాత్రి మామ, అల్లుడి మధ్య తీవ్ర గొడవ జరిగింది. అది కాస్త ఘర్షణకు దారి తీసి తీవ్రంగా ఒకరపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరూ మృతిచెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story