- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్లు పందెం కాసిన వ్యక్తి.. తీరా చూస్తే జరిగింది ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ఉత్కఠభరితంగా సాగాయి. ఈ క్రమంలోని ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయంపై ఓ సమయంలో జోరుగా చర్చ జరిగింది. అయితే, కొన్నిచోట్ల గెలుపు తమదంటే.. తమదేనని అధికార, ప్రతిపక్ష నాయకులు బాహాబాహీకి దిగిన ఘటనలు జరిగాయి. మరోవైపు పార్టీల గెలుపోటములపై రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగ్ జోరుగా నడిచింది. ఎవడికి తోచినంత వాడు తమ అభిమాన పార్టీలపై బెట్టింగ్ కాస్తూ.. సర్వం పోగొట్టుకున్న వాళ్లు ఉన్నారు. పందెంలో గెలిచిన ఆస్తులు కూడబెట్టుకునోళ్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి ఏకంగా రూ.30 కోట్ల పందెం వేశాడు. అయితే, జూన్ 4న అంటే ఫలితాలు వెలువడిన రోజు ఆయన ఊరు విడిచి వెళ్లిపోయాడు. తాజాగా, వేణుగోపాల్‌రెడ్డి ఒంటిపై గాయాలతో తన పొలం వద్ద మామిడి తోటలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. కాగా, ఆయన మృతుడి భార్య సర్పంచ్ కాగా వారంతా వైఎస్ఆర్‌సీపీ మద్దతుదారులకుగా తెలుస్తోంది.