- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి..!

దిశ, వెబ్‌డెస్క్: దండకారణ్యం మరోసారి తుపాకుల మోతతో దద్దరిల్లింది. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్-దంతెవాడ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డట్లు సమాచారం. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సలైట్లు తారసపడటంతో ఇరు వర్గాలు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మరణించగా.. పలువురు జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది.
పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మృతి చెందిన మావోయిస్టుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇటీవల దండకారణ్యంలో వరుస ఎన్ కౌంటర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. గడిచిన మూడు నెలల్లోనే జరిగిన ఎన్ కౌంటర్లలో దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలు మరువకముందే తాజగా జరిగిన మరో ఎన్ కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఎన్ కౌంటర్‌ను భద్రాలు దళాలు దృవీకరించాల్సి ఉంది.