- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
rape attempt : 8 ఏళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారయత్నం
by Sridhar Babu |

X
దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండలో దారుణం జరిగింది. కాకతీయ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 8 ఏళ్ల బాలికను నమ్మించి యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటి సమీపంలో ఉన్న ప్లంబర్ పనిచేసే ఓ యువకుడిని బాలిక తన తల్లికి ఫోన్ చేయమని అడగగా ఫోన్ చేస్తానని ఇంట్లోకి పిలిచి నమ్మించి బాలిక పై అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు.
బలవంతంగా బట్టలు విప్పి అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. బాలిక తీవ్రంగా ప్రతిఘటించి అతని చేతిని కొరకడంతో బాలికను వదిలేశాడు. ఇంట్లో నుంచి బయటకు పరుగెత్తి తన తల్లికి సమాచారం ఇవ్వడంతో వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు నిందుతుడి పై ఫోక్సో కేసు నమోదు చేసి యువకుడిని రిమాండ్ తరలించామని కేయూ పోలీస్ అధికారి తెలిపారు.
- Tags
- rape attempt
Next Story