గేదెలను చెరువులో కడగడానికి వెళ్లి మృత్యువాత

by Sridhar Babu |
గేదెలను చెరువులో కడగడానికి వెళ్లి మృత్యువాత
X

దిశ,నిజాంసాగర్ : గేదెలను చెరువులో కడగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి యువకుడు మృతి చెందిన ఈ సంఘటన నిజాంసాగర్ మండలంలోని నర్సింగ్ రావు పల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. నిజాంసాగర్ ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావు పల్లికి చెందిన నంగి ప్రభాకర్ (27) అనే యువకుడు తనకున్న గేదెలను ఊర చెరువులో కడగడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఈతరాక మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతునికి భార్య నంగి పుష్ప, ఒక కుమారుడు దుర్గాప్రసాద్ ఉన్నారు.

Advertisement

Next Story