HYD: యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి

by GSrikanth |
HYD: యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై యాసిడ్ దాడి
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ఇక్ఫాయ్ యూనివర్సిటీలో దారుణం చోటుచేసుకుంది. లేఖ అనే విద్యార్థినిపై తోటి విద్యార్థులే యాసిడ్ దాడికి పాల్పడ్డారు. కాలేజీ మైదానంలో, గేటు బయటో, ఎవరూ లేని సమయంలో క్లాస్‌ రూమ్‌లో అనుకుంటే పొరపాటే. ఏకంగా కాలేజీలో జరుగుతున్న వేడుకలో ఈ దాడికి పాల్పడ్డారు. అయితే కొందరు విద్యార్థులు రంగు నీళ్లకు బదులు బకెట్లో యాసిడ్ నింపారు. రంగు నీళ్లే అనుకొని విద్యార్థులు తోటి విద్యార్థిని లేఖపై యాసిడ్ పోశారు. దీంతో లేఖకు తీవ్ర గాయాలు అయ్యారు. వెంటనే స్పందించిన కాలేజీ యాజమాన్యం ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story

Most Viewed