పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం: యూపీలో నలుగురు విద్యార్థులు మృతి

by samatah |
పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం: యూపీలో నలుగురు విద్యార్థులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలో జరుగుతున్న బోర్డ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు పాఠశాల విద్యార్థులు మరణించారు. ఎస్పీ సంజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..షాజహాన్‌పూర్ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు మంగళవారం బోర్డు పరీక్ష రాసేందుకు జైతీపూర్‌లోని తమ ఎగ్జామ్ సెంటర్‌కు ఓ వాహనంలో వెళ్తుండగా..జురాగావ్ గ్రామ సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి కాలువలో పడింది. దీంతో నలుగురు విద్యార్థులు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉండగా..వారిని అనురప్ ఖుష్వాహా (15), అనురాగ్ శ్రీవాస్తవ (14), ప్రతిష్ఠా మిశ్రా (15), మోహిని మౌర్య (16)గా గుర్తించారు. క్షతగాత్రులైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. వాహనం టైరు పగిలిపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు ఎస్పీ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed