Accident: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

by Shiva |
Accident: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలైన దుర్ఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల పరిధిలోని అన్నవరప్పాడు హైవే బ్రిడ్జిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వినుకొండ నియోజకవర్గ పరిధిలోని ఈపూరు మండలం గోపువారి‌పాలెం గ్రామానికి చెందిన మొండితోక బాలశౌరి, రావెల వెంకటేశ్వర్లు బైక్ వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు అన్నవరప్పాడు హైవే బ్రిడ్జిపైకి రాగానే వెనుక నుంచి లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలశౌరి, వెంకటేశ్వర్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం నర్సారావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story