రాష్ట్ర రాజధానిలో మరో సంచలనం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి

by Gantepaka Srikanth |
రాష్ట్ర రాజధానిలో మరో సంచలనం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతిచెందింది. ఈ ఘటన గచ్చిబౌలి పరిధి గోపన్‌పల్లి తండాలో చోటుచేసుకుంది. యువతిపై దాడి చేయడానికి గమనించిన పలువురు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడు వారిపైనా కత్తితో దాడి చేశారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం దగ్గర్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed