- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Dulquer Salmaan: అలా చూసి నా వైఫ్ నన్ను మిస్ అవుతుంది.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar). బ్లాక్ బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ (Update) ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్‌తో సందడి చేస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా.. ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ తన పలు విషయాలు మీడియాతో పంచుకున్నారు.
‘నటుడిగా నాకంటూ కొన్ని నియమాలు (rules) పెట్టుకున్నాను. డిఫరెంట్ స్టోరీస్ (Different Stories), అద్భుతమైన పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను మెప్పించాలి అనుకుంటాను. రీమేక్స్‌లో యాక్ట్ చేయడం నాకు నచ్చదు. పీరియాడికల్ (periodical) చిత్రాల్లో నటించాలని నేను అనుకోలేదు. అలాగే.. కథ నచ్చినప్పుడు ఆయా చిత్రాలకు నో కూడా చెప్పలేను కదా. వీలున్నప్పుడు సెట్స్‌కు నా భార్య (wife) వస్తుంటుంది. వివిధ గెటప్పుల్లో ఆమె నన్ను చూసి.. మా ఆయన్ని నేను మిస్ (miss) అవుతున్నా అంటుంది’ అని చెప్పుకొచ్చారు.
Read More..