కాల్పుల్లో ఏడేళ్ల బాలిక మృతి..అమెరికాలోని చికాగోలో విషాదం

by samatah |
కాల్పుల్లో ఏడేళ్ల బాలిక మృతి..అమెరికాలోని చికాగోలో విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చికాగో నగరంలో జరిగిన కాల్పుల్లో ఏడేళ్ల బాలిక మృతి చెందగా..మరో ఏడుగురు గాయపడ్డారు. చికాగోలోని బ్యాక్ ఆఫ్ ది యార్డ్స్ పరిసర ప్రాంతంలో ఓ ఫంక్షన్ జరుగుతుండగా ప్రజలంతా గుమిగూడారు. ఈక్రమంలోనే ఇద్దరు దుండగులు జన సమూహం పైకి కాల్పులు జరిపినట్టు చికాగో పోలీస్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ చీఫ్ డాన్ జెరోమ్ తెలిపారు. ఈ ఘటనలో ఏడేళ్ల బాలిక తలకు బుల్లెట్ తాకగా ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించింది. అలాగే మరో ముగ్గురు పిల్లలు సహా ఏడుగురికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వీరందరినీ ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా స్థానిక ప్రాంతంలోనే నివాసముంటారని జెరోమ్ వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారని త్వరలోనే వారిని పట్టుకుంటామని పేర్కొన్నారు.

Advertisement

Next Story