- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
crime : బైకు అదుపుతప్పి కాకునూరు వాసి మృతి
by Sridhar Babu |
X
దిశ, తలకొండపల్లి : కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామానికి చెందిన గంగోజి బ్రహ్మచారి (50) అనే కార్పెంటర్ బైక్ అదుపుతప్పి తలకొండపల్లి మండలంలోని జూలపల్లి గ్రామ శివారు ప్రాంతంలో మృతి చెందాడు. తన కూతురు కాసోజు శిరీష ఫిర్యాదు మేరకు తలకొండపల్లి ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. స్థానిక పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
మృతుడు బ్రహ్మచారి తన బావ మణికంఠతో కలిసి మిడ్జిల్ మండలానికి పని నిమిత్తం వెళ్లి తిరుగు ప్రయాణంలో జూలపల్లి గ్రామం మీదుగా కాకునూరుకు వెళ్తుండగా బైకు అదుపుతప్పి కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. అనంతరం శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్టు ఎస్సై శ్రీకాంత్ పేర్కొన్నారు.
Advertisement
- Tags
- crime
Next Story