అన్నదమ్ముల మధ్య గొడవ అమ్మ ప్రాణం తీసింది

by Sridhar Babu |
అన్నదమ్ముల మధ్య గొడవ అమ్మ ప్రాణం తీసింది
X

దిశ, పరిగి : అన్నదమ్ముల మధ్య డబ్బుల విషయంలో గొడవను నివారించేందకు వచ్చిన ఓ తల్లి మృతి చెందింది. పరిగి ఎస్​ఐ సంతోష్​ తెలిపిన వివరాల ప్రకారం కుక్కల వెంకటయ్య, శ్రీను అన్నదమ్ములు. వీరి అమ్మ శంకరమ్మ, శ్రీను సయ్యద్​ మల్కాపూర్​ లో నివాసం ఉంటున్నారు. డబ్బుల విషయంలో బుధవారం రాత్రి తాగిన మత్తులో అన్న వెంకటయ్య, తమ్ముడు శ్రీను గొడవ పడ్డారు.

వీరిద్దరిని విడిపించేందుకు తల్లి శంకరమ్మ రావడంతో మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. దీంతో తమ్ముడు శ్రీను అడ్డు వచ్చిన తల్లిని పక్కకు తోశాడు. దీంతో శంకరమ్మ సీసీ రోడ్డుపై పడి ముక్కులోంచి రక్తం వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. వెంటనే పరిగి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా శంకరమ్మ అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. అన్న వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్​ఐ సంతోష్​ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed