- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరుస చోరీలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్..!
దిశ,వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఆయా మండలాల్లో చోరీలకు పాల్పడిన దొంగ పోలీసులకు చిక్కాడు. శుక్రవారం వెల్దండ పోలీసులు వాహన తనిఖీలు జరుపుతుండగా అనుమానాస్పదంగా తిరగడంతో పట్టుకొని విచారించారు. అతని నుండి 18 తులాల బంగారం ఒక వాహనాన్ని సీజ్ చేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆదేశాల మేరకు కోర్టు ముందు హాజరు పరిచినట్లు వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ప్రాంతంలోని అంబర్పేట్ బతుకమ్మ కుంట ప్రాంతానికి చెందిన అల్లం శివ అనే పాత నేరస్తుడు నెల రోజులుగా వెల్దండ, పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరిపినట్లు ఒప్పుకున్నాడు.
పెద్దాపూర్ గ్రామంలో ఒక ఇంట్లో దొంగతనం చేసి రెండున్నర తులాల బంగారం, కుప్పగండ్లలో ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, ఊరుకొండ మండలంలోని రెవల్లి గ్రామంలో 3.5 తులాల బంగారు ఆభరణాలు, కల్వకుర్తి మండలం లోనీ యంగంపల్లిలో 5 గ్రాములు, మిడ్జిల్ మండలం లోని వద్యాల గ్రామంలో 4 తులాలు, బంగారు ఆభరణాలు మొత్తంగా 18 తులాల బంగారం దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. అనంతరం దొంగిలించిన బంగారాన్ని అతడి నుంచి రికవరీ చేసి జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ ఆదేశాల మేరకు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, వెల్దండ ఎస్సై కురుమూర్తి, సిబ్బంది నవీన్, అంజి, సందీప్, కిషోర్ ఎస్పీ అభినందించారు.