- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
crime : డ్రైన్ లో పడి వ్యక్తి మృతి
దిశ, భద్రాచలం : రోడ్డు పక్కన ప్లాస్టిక్ సామాన్లు ఏరుకునే వ్యక్తి, డ్రైనేజీ లో వెళ్తున్న ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించడం కోసం కాలువలోకి దిగడంతో డ్రైనేజీ నీరు వేగంగా వెళ్తున్న క్రమంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న అతని భార్య గట్టిగా రోధించడంతో పక్కనే ఉన్న వారు స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సుమారు మూడు గంటలపాటు శ్రమించి మృతుడు సున్నం సతీష్ ని వెలికి తీశారు. సతీష్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం పామెడ్ కు
చెందిన వ్యక్తి. సున్నం సతీష్ సునీత భార్యాభర్తలు. వీరు గత కొంతకాలంగా పట్టణంలో వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే క్రమంలో బుధవారం మధ్యాహ్నం చర్ల రోడ్ లోని కేకే ఫంక్షన్ హాల్ సమీపంలోని ప్రధాన రహదారిలో ఉన్న డ్రైనేజీ లో ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకునే క్రమంలో ఒక్కసారిగా బురదలో జారి డ్రైనేజీ లో గల్లంతు అయ్యాడు. డ్రైనేజీ సుమారు 8 అడుగుల లోతు ఉండడంతో ఈత రాక నీళ్ల వేగానికి డ్రైనేజీ కిందనే ఇరుక్కుని మృతి చెందాడు.
- Tags
- crime