రాష్ట్రంలో మరో దారుణం.. తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం

by GSrikanth |
రాష్ట్రంలో మరో దారుణం.. తల్లి లేని సమయంలో కూతురిపై అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇస్నాపూర్‌లో పెద్దిరాజు అనే ఓ వ్యక్తి తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. తన వద్దకు కూలీ పనికి వచ్చే ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపైనా కన్నేశాడు. ఇటీవల ఇంట్లో తల్లిలేని సమయం చూసి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లి ఫిర్యాదు మేరకు పటాన్ చెరు పోలీసులు పెద్దిరాజుపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story