కొన్ని రోజుల్లో కూతురి పెళ్లి.. లండన్‌లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య

by GSrikanth |
కొన్ని రోజుల్లో కూతురి పెళ్లి.. లండన్‌లో హైదరాబాద్ వ్యక్తి దారుణ హత్య
X

దిశ, డైనమిక్ బ్యూరో: లండన్‌లో హైద్రాబాద్ చెందిన వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన తాజాగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెలితే హైదరాబాద్‌కు చెందిన రైసుద్దీన్ అనే వ్యక్తి ఉపాధి కోసం లండన్ వెళ్లాడు. తన కూతురు పెళ్లి నిశ్చయం కావడంతో.. పెళ్లి కోసం హైదరాబాద్‌కు వచ్చే సమయంలో దుండగులు రైసుద్దీన్‌పై దాడి చేసి దోచుకున్నట్లు తెలిసింది. దుండగుల దాడిలో రైసుద్దీన్ అక్కడే మృతి చెందగా.. అతని వద్ద ఉన్న నగదును దుండగులు దోచుకున్నారని సమాచారం. ఈ క్రమంలోనే రైసుద్దీన్ మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులకు సమాచారం వచ్చింది. దీంతో పెళ్లి ఏర్పాట్లలో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. రైసుద్దీన్ మృతదేహన్ని హైద్రాబాద్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed