రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి

by Sridhar Babu |
రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, ఎర్రుపాలెం : మండలంలోని మీనవోలు గ్రామ సమీపంలో శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపురం గ్రామానికి చెందిన పొట్టేటి తిరుపతిరెడ్డి తన ఏడు సంవత్సరాల కుమారుడు అవినాష్ రెడ్డిని బైక్ పై ఎక్కించుకొని మధిరకు వెళ్లే క్రమంలో మీనవోలు దాటిన తర్వాత అదే గ్రామానికి

చెందిన కర్నాటి వెంకట్రామిరెడ్డి (55) తన పొలంలో పని చేసుకుని ఇంటికి వెళ్తూ రోడ్డుపైకి రావడంతో రెండు బైకులు బలంగా ఢీకొని వెంకట్రామిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. తిరుపతి రెడ్డికి తన కుమారుడికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో మధిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story