- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆగి ఉన్న లారీని ఢీకొని వ్యక్తి మృతి
by Sridhar Babu |

X
దిశ, పరిగి : ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పరిగి ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా సేడెం తాలుకాకు చెందిన కాణగడ్డ గ్రామానికి చెందిన చాకలి రాజు (35) అనే వ్యక్తి తన భార్య సునిత, ముగ్గురు పిల్లలతో కలిసి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో మేస్త్రి పని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ ఫైనాన్స్ కట్టి వస్తానని మంగళవారం ఉదయం బయలుదేరాడు. ఫైనాన్స్ కట్టి తిరిగి వస్తూ పరిగి మండలం చింతల్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీ కొట్టాడు. తీవ్ర గాయాలైన చాకలి రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు.
- Tags
- man died
Next Story