అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య..

by Sumithra |
అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య..
X

దిశ, హుస్నాబాద్ : అప్పుల బాధ తాళలేక ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం హుస్నాబాద్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని, కరీంనగర్ రోడ్డులో గల బేడ బుడగ జంగాల కాలనీలో చెన్నూరు సమ్మయ్య(40) నివాసం ఉంటున్నాడు. ఇతను ఇనుప సామాను బేరం చేస్తుంటాడు.

ఎప్పటి మాదిరిగానే బేరానికి వెళ్లి వచ్చి సోమవారం సాయంత్రం సోదరినితో అప్పులు ఎక్కువయ్యాయని, జీవితం గడవడం కష్టంగా ఉందని చెప్పి కన్నీటి పర్యంతం అయ్యాడు. ఎంత ధైర్యం చెప్పినా వినకుండా తీవ్ర మనస్తాపం చెందాడని తెలిపారు. అదే క్రమంలో మంగళవారం ఉదయం ఎదురుగా ఉన్న మోదుగు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. కాగా సమ్మయ్యకు రాజేశ్వరి (20), రేణుక (18) ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అలాగే రాకేష్ (17) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న యజమాని చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed