- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
arrest : పందెం కోళ్ల దొంగల ముఠా అరెస్ట్
దిశ, సుల్తానాబాద్ : జల్సాలకు బానిసలై అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో పందెం కోళ్ల దొంగలుగా మారి అడ్డంగా దొరికిపోయారు. అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో పందెం కోళ్ల దొంగతనాలు చేస్తూ జైలు జీవితం గడపడం, తిరిగి వచ్చి మళ్లీ పందెం కోళ్ల దొంగతనాలు చేయడమే వృత్తిగా ఎంచుకున్న నిందితుల వివరాలను పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వివరించారు. బుధవారం సుల్తానాబాద్ పోలీస్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జూలై 26 న సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో సతీష్ రావు కు చెందిన 22 నాటు కోళ్లను దొంగిలించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం సీపీ శ్రీనివాసులు, పెద్దపల్లి డీసీపీ చేతన ఆదేశాల మేరకు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై నరేష్ కుమార్ బృందం చాకచక్యంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారని వివరించారు.
నిందితులు మేచర్ల ఏసుబాబు (బీసీ కాలనీ పరిటాల కంచికచర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా), గ్యార విష్ణు (గోకరాజు పల్లి కాలనీ వీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా), మేచర్ల కిషోర్ (బీసీ కాలనీ జిమ్మవరం వీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా) అనే ముగ్గురిపై గతంలో కోళ్ల దొంగతనం కేసులు నమోదయ్యాయని, దొంగ తనాన్ని వృత్తిగా ఎంచుకున్న వీరు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో పగలు రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో దొంగతనాలకు పాల్పడుతూ విక్రయించగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేయడం వృత్తిగా ఎంచుకున్నారని వివరించారు. దొంగిలించిన కోళ్లను దొంగలకు చెందిన షిఫ్ట్ కార్ లో విక్రయించేందుకు నిందితులు వెళుతుండగా నూతన టెక్నాలజీని వినియోగించి బుధవారం సుల్తానాబాద్ మండల
కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిందితుల తో పాటు 22 నాటు కోళ్లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రావణ్ కుమార్ తోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై నరేష్ కుమార్, ఏఎస్ఐ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, కానిస్టేబుల్ తిరుపతి నాయక్, రమేష్, రాజకుమార్, రమేష్లను అభినందిస్తూ రివార్డులు అందించారు.
- Tags
- arrest