రూ.10 విషయంలో ఆటో డ్రైవర్​, ప్రయాణికుడి మధ్య తలెత్తిన వివాదం

by Sridhar Babu |
రూ.10 విషయంలో ఆటో డ్రైవర్​, ప్రయాణికుడి మధ్య తలెత్తిన వివాదం
X

దిశ, చార్మినార్​ : రూ. 10 విషయంలో ఆటో డ్రైవర్​ ప్రయాణికుడికి తలెత్తిన వివాదంలో ఆటో డ్రౌవర్​ మృతికి దారితీసిన ఘటన శాలిబండ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శాలిబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ వట్టేపల్లి కి చెందిన మోహమ్మద్ అన్వర్(37)వృత్తి రీత్యా ఆటో డ్రైవర్​. ఈ నెల 12వ తేదీన పాతబస్తీ ఫలక్​నుమ నుంచి చార్మినార్ వైపునకు ప్యాసింజర్​ ఆటోను నడుపుకుంటూ బయలుదేరాడు. మార్గమధ్యలో ఫలక్​నుమ వద్ద 16 సంవత్సరాల మైనర్​ యవకుడు మొహమ్మద్​ అన్వర్​ ఆటో ఎక్కాడు.

శంషీర్​గంజ్​ ప్రాంతంలో ఆటో దిగిన సదరు మైనర్​ యువకుడు ఆటో డ్రైవర్​కు 10 రూపాయలు ఇవ్వబోయాడు. దీనికి ససేమిరా అన్న ఆటో డ్రైవర్​ రూ.20 చెల్లించాల్సిందేనన్నాడు. ఇంత దూరానికి రూ.10 ఎక్కువ అని తీసుకో అని చెప్పడంతో మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్​ సదరు యువకుడిని దుర్భాషలాడాడు. దీంతో వీరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలో డ్రైవర్​ను యువకుడు తోసి వేయడంతో ఆటోడ్రైవర్​ కిందపడ్డాడు. అక్కడ రాయి ఉండడంతో ఆటో డ్రైవర్​ తలకు బలమైన గాయాలయ్యాయి. గాయపడిన ఆటో డ్రైవర్ అన్వర్​​ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ కేసును శాలిబండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed