ఆలయంలో మహిళ మృతదేహం.. పండుగపూట కలకలం రేపుతోన్న ఘటన

by GSrikanth |
ఆలయంలో మహిళ మృతదేహం.. పండుగపూట కలకలం రేపుతోన్న ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా సూరారంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. సూరారంలోని శివాలయం వద్దనున్న ఖాళీ స్థలంలో కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం కనిపించింది. ఆదివారం ఉదయం భోగి పండుగ కావడంతో ఆలయంలోకి వెళ్లిన పలువురి దుర్వాసన రావడంతో పరిసరాలను పరిశీలించి చూడగా.. మహిళ మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story