- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ganja : గంజాయికి అలవాటుపడ్డ ఇద్దరు యువకులపై కేసు నమోదు
దిశ, చందుర్తి : గంజాయికి అలవాటుపడ్డ ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యువత మత్తు పదార్థాలు వాడితే జీవితం అంధకారం అవుతుందని చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. చందుర్తి మండలంలోని మూడపల్లి పరిసర ప్రాంతాల్లో కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన ఓ యువకుడు, అలాగే చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన మరో యువకుడు ఇద్దరు కలిసి గంజాయి తాగుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి ఇరువురి
పై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. యువత మత్తు మందు వాడడం వలన శరీరంలో తెలియని మార్పులు చోటు చేసుకుంటాయని, యువత బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని కోరారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి అక్రమ గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి ఉక్కు పాదం మోపడం జరుగుతుందన్నారు. గంజాయి సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
- Tags
- ganja