- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం, ఆరుగురికి తీవ్ర గాయాలు

దిశ, భిక్కనూరు: జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని కారు ఢీకొని ఒకరు దుర్మరణం పాలైన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలం సిద్ధ రామేశ్వరనగర్ సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన కుటుంబ సభ్యులు కారులో ఉదయం ఆదిలాబాద్‌కు బయలుదేరారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు సురేష్ దాబా ఎదురుగా ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న శివ తలకు బలమైన గాయాలు కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తుకు తోడు, ముసురు పడుతుండటంతో వైపర్ పని చేయక ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.