POCSO case : పోక్సో కేసులో 20 ఏళ్లు జైలు

by Sridhar Babu |
POCSO case : పోక్సో కేసులో 20 ఏళ్లు జైలు
X

దిశ, ఖమ్మం సిటీ : బాలికపై లైంగిక దాడి కేసు (పోక్సో)లో గంగిశెట్టి రాకేష్కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.50 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె. ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. రఘునాథపాలెం మండలానికి చెందిన 10 ఏళ్ల బాలిక 2022 నవంబర్ 26 న స్కూల్ నుంచి ఇంటికి వచ్చి ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిపై రఘునాథపాలెం మండలం, బూడిదంపాడు గ్రామానికి చెందిన గంగిశెట్టి రాకేష్ బాధిత బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై రోజువారీ కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు

2022 నవంబర్ 27 న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితులపై మోపిన నేరం రుజువు కావడంతో తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అదనపు ప్రాసిక్యూటర్ జి.హరీందర్ రెడ్డి వాదించారు. విచారణ అధికారులు ఏసీపీ అంజనేయులు, భస్వారెడ్డి, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం.ఉమా రాణి, కోర్టు కానిస్టేబుల్ జి.రవి కిషోర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్, బి. రామూర్తి ఎస్‌ఐ,కె.శ్రీనివాసరావు హెచ్‌సీ కె. మోహన్ రావు, హెచ్‌సీ హోమ్ గార్డు అయ్యూబ్ ను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed