- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆడిషన్స్‌కి వెళ్తే బాడీ షేమింగ్ చేశారు.. బిగ్‌బాస్ బ్యూటీ పూజ మూర్తి
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి పూజ మూర్తికి పరిచయం అవసరం లేదు. ‘గుండమ్మ కథ’ సీరియల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అలాగే సూపర్ క్వీన్స్ షో లో కూడా పాల్గొన్నది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ 2.0 బినీ లాంచ్‌తో హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. పూజాకు మొదట్లోనే ఇంట్లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. కానీ ఆమె తండ్రి చనిపోవడంతో ఇంట్లోకి వెళ్లలేక పోయింది.
తాజాగా, పూజ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి పలు విషయాలను వెల్లడించింది. ‘‘ నేను కన్నడ పరిశ్రమకు చెందిన అమ్మాయిని. నటనపై ఆసక్తితో కెరీర్ మొదట్లో ఆఫీసులకు వెళుతూ ఆడిషన్స్ ఇచ్చాను. ఇలా ఆడిషన్స్ ఇచ్చే సమయంలో చాలామంది నేను లావుగా ఉన్నానని నన్ను రిజెక్ట్ చేసేవారు. ఇలా ఆడిషన్స్‌కి వెళ్లిన ప్రతిసారి బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంతో గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేదాన్ని. టాలెంట్ ఉంటే మనల్ని ఎవరు తొక్కేయలేరు అనుకుని అందుకే ఎన్ని అవమానాలు ఎదురైనా నేను నా ప్రయత్నాలు చేశాను. ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే తెలుగులో సీరియల్స్ చేసే అవకాశం అందుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.