- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ అరెస్ట్.. పోలీసులు మోపిన నేరాలు ఇవే..
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ హౌస్‌లోకి పోలీసులు ఎంట్రీ ఇవ్వడం కలకలం సృష్టించింది. గేమ్ షోలో ఉన్న కంటెస్టెంట్‌ను అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. హీరో కిచ్చ సుదీప్ హోస్ట్ గా కన్నడలో బిగ్ బాస్ 10 సీజన్ నడుస్తోంది. ఈ రియాల్టీ గేమ్ షోలో అఖిల భారత గో సంరక్షణ కమిటీ అధ్యక్షుడు వర్తుర్ సంతోష్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. వ్యవసాయదారుడైన సంతోష్ కర్ణాటకలో పశువుల సంరక్షణ కోసం పాటుపడుతున్నారు. జంతువుల రక్షణకు ఆయన చేస్తున్న సేవలను గుర్తించి బిగ్ బాస్ 10 సీజన్ లో అవకాశం కల్పించారు.
కాగా, ఆయన మెడలో పులిగోరు ధరించడాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. దానిని నిర్ధారించుకోవడానికి బిగ్ బాస్ హౌస్‌కు వెళ్లిన పోలీసులు.. అది నిజమైన పులిగోరే అని ధ్రువీకరించుకున్నారు. చట్ట విరుద్ధంగా పులిగోరును ఆభరణంగా ధరించడం నేరంగా పేర్కొంటూ వర్తుర్ సంతోష్‌ను అరెస్ట్ చేశారు. సంతోష్‌పై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని రామోహల్లీ ఫారెస్ట్ ఆఫీసర్స్ తెలిపారు. అతను వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని, నేరం రుజువైతే 3-7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని అధికారులు తెలిపారు.