- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతు బిడ్డకు 26 ఎకరాలు, 4 కార్లు, కోట్ల ఆస్తి?.. పల్లవి ప్రశాంత్ తండ్రి తాజాగా స్పందించి..!
దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ 7 సీజన్లలో చూసుకున్నట్లైతే మొదటిసారిగా ఒక రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ హౌస్‌లోకి అడుగు పెట్టాడు. బిగ్ బాస్ లాంచ్ రోజే బియ్యం బస్తా పట్టుకెళ్లి.. నాగార్జునకు బహుమతిగా ఇచ్చి అసలైన రైతుబిడ్డని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం హౌస్‌లో తనదైన స్టైల్లో గేమ్ ఆడుతూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు కానీ.. పదే పదే రైతు బిడ్డ అనడం హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు నచ్చడం లేదు. అయితే తాజాగా ప్రశాంత్‌కు 26 ఎకరాల భూమి, 4 కార్లు, పెద్ద బంగ్లా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై పల్లవి ప్రశాంత్ తండ్రి స్పందించి.. ‘‘మా గురించి అనవసరపు వార్తలు ప్రచారం చేస్తున్నారు.
నిజంగా 26 ఎకరాల పొలం, నాలుగు కార్లు, పెద్ద భవంతి ఉంటే నా కొడుకు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్తాడు? అలా అయితే పెద్ద ఉద్యోగమే చేసుకునేవాడు కదా? మీరు అన్నట్లుగా అంత ల్యాండ్ ఉంటే.. ఎక్కడుందో మీరే చూపించండి మరీ. నాకున్నది 6 ఎకరాలు పొలం మాత్రమే! దాన్ని పంచితే ప్రశాంత్‌కు 2 ఎకరాలు వస్తది అంతే. బిగ్‌బాస్ ఇంట్లో నా కుమారుడ్ని చిన్నచూపు చూస్తూ.. వారు అనే మాటలకు నాకు చాలా బాధేస్తుంది. ఒకవేళ ప్రశాంత్ నిజంగా బిగ్‌బాస్ విన్నర్ అయితే మాత్రం ఆ డబ్బు నిరుపేద రైతులకు ఇస్తాను. అంతకన్నా సంతోషం నాకు ఇంకోకటి ఉండదు. పొలాన్ని నమ్ముకున్న ఎంతోమంది రైతులు మా కళ్లముందే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లు పడే కష్టాలు ఏంటో.. కళ్లారా చూసిన మాకు మాత్రమే తెలుసు’’ అని పల్లవి ప్రశాంత్ తండ్రి బాధతో కూడిన కోపంతో చెప్పుకొచ్చాడు.