- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
స్పీడ్‌గా అయోధ్యలో మందిరం నిర్మాణం.. బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పుడు..?
దిశ, వెబ్‌డెస్క్: 2.77 ఎకరాల స్థలం.. శతాబ్ధాల నాటి వివాదం.. అయోధ్యలో రామ మందిరం బాబ్రీ మసీదు వివాదానికి తెరపడగా.. రామ మందిర నిర్మాణం దాదాపు పూర్తి కాగా ఈ నెల 22న అట్టహాసంగా ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మసీదు నిర్మాణంపై ఆసక్తి నెలకొంది. మసీదు నిర్మాణం కోసం ఉత్తర ప్రదేశ్‌లోని ధన్నీపూర్ గ్రామం అయోధ్యకు 25 కిలో మీటర్ల దూరంలో ఉండగా ఇక్కడే మసీదు నిర్మించుకోవాలని సున్నీ వక్ఫ్ బోర్డుకు కోర్టు తెలిపింది. రామమందిరం ప్రారంభోత్సవానికి రెడీ కాగా ఈ మసీదు నిర్మాణ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
ఆ స్థలంలో పాత దర్గాను మాత్రం పునరుద్ధరించారు. మసీదు నిర్మాణం ఎందుకు ప్రారంభం కాలేదనే విషయాన్ని కోర్టు వ్యాజ్యంలో ముస్లింల తరఫున కొనసాగించిన ఇక్బార్ అన్సారీ క్లారిటీ ఇచ్చారు. ‘వక్ఫ్ బోర్డుకు భూమిని కేటాయించారు. అక్కడ మసీదు నిర్మించే బాధ్యత వారిదే.. అయితే ఇప్పటి వరకు ఎలాంటి పని చేయలేదు. దేశంలోని ముస్లింలు ఎవరూ దీనిని ప్రశ్నించడం లేదని ఫైర్ అయ్యారు. కొత్త మసీదు గురించి స్థానిక ముస్లింలు ఆందోళన చెందడం లేదని.. వారికి తగినన్ని మసీదులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఇస్లామిక్ షరియా చట్టం ప్రాకం మసీదును ఒక చోటు నుంచి మరో చోటుకి తరలించకూడదు. లేదా మసీదును మరో చోటుకి మార్చకూడదని.. అయోధ్య కేసులో ముస్లింల తరఫున ఉన్న మరో వ్యక్తి ఖాలిక్ అహ్మద్ ఖాన్ అన్నారు. మసీదు నిర్మాణం ఎప్పుడు స్టార్ అవుతుందనే విషయాన్ని లక్నోలో ఉండే మసీదు ట్రస్ట్ సెక్రటరీ తాజాగా వెల్లడించారు. నిధుల సమీకరణ జరగకపోవడంతోనే మసీదు నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమన్నారు. వేగంగా నిధుల సమీకరణ జరిపేందుకు పద్ధతుల్లో మార్పులు తెచ్చామని రెండు, మూడు నెలల్లో మసీదు నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయన్నారు.