- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సరయూనది ఒడ్డున మహాయాగం.. 21 వేల మంది పూజారులతో రామనామ యజ్ఞం..
దిశ, ఫీచర్స్ : అయోధ్యలోని రామమందిరంలో రామ లల్లాకు పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండడంతో రామభక్తుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అయోధ్యలోని సరయూ నది ఒడ్డున 21 వేల మంది పూజారులతో రామనామ మహాయజ్ఞం నిర్వహించనున్నారని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నేపాల్‌కు చెందిన 21 వేల మంది పూజారులు రాముడి నగరమైన అయోధ్యకు చేరుకోబోతున్నట్లు సమాచారం.
ఈ మహాయజ్ఞం కోసం 1008 కుటీరాలను నిర్మించారని, 11 పొరల పైకప్పును కలిగిన యాగ మండపం కూడా నిర్మించారని పండితులు చెబుతున్నారు. అలాగే రామాలయానికి 2 కిలోమీటర్ల దూరంలో సరయూ నది ఘాట్ పై 100 ఎకరాల్లో టెంట్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అయోధ్య నివాసి, నేపాల్‌లో స్థిరపడిన ఆత్మానంద దాస్ మహాత్యాగి అలియాస్ నేపాలీ బాబా ఈ మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు.
యాగం అంటే ఏమిటి ?
మత గ్రంధాల ప్రకారం, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్పనిసరిగా యాగం చేస్తారు. యాగం అనేది ఆధ్యాత్మికతను పెంచుతుంది. పురాణాల ప్రకారం, దశరథ రాజు తన ముగ్గురు భార్యలలో ఎవరికీ సంతానం కలగకపోవడంతో ఆందోళనకు గురయ్యాడట. అప్పుడ దశరథ మహారాజుకు పుత్రసంతానం కలిగేందుకు శృంగి మహర్షి ఒక ఉపాయం చెప్పాడట. పుత్ర కామేష్టి యాగం చేస్తే మగసంతానం కలుగుతుందని సలహా ఇచ్చాడు. శృంగి మహర్షి సలహా మేరకు, దశరథ రాజు పుత్రేకామేష్టి యాగం చేసాడు. యాగం తరువాత అతను తన ముగ్గురు భార్యలకు పాయసాన్ని ప్రసాదంగా తినిపించాడు. దీని కారణంగా దశరథ రాజుకు శ్రీరామునితో పాటు ముగ్గురు కుమారులు జన్మించారట.