- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన రాముడు మళ్లీ వచ్చాడు.. ప్రధాని మోడీ ఆసక్తికర ప్రసంగమిదీ
దిశ, నేషనల్ బ్యూరో : బాలరాముడు ఇక టెంటులో ఉండాల్సిన అవసరం లేదని, రామ మందిరంలోనే ఉంటాడని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఎన్నో బలిదానాలు, త్యాగాల తర్వాత రామమందిరం సాకారమైన ఈ తరుణం యావత్ దేశానికి నిజమైన దీపావళి అని చెప్పారు. ఈ శుభ గడియల్లో దేశ ప్రజలందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. అయోధ్య రామ మందిరం గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ అనంతరం నిర్వహించిన సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దశాబ్దాల న్యాయపోరాటం తర్వాత రామమందిరాన్ని న్యాయబద్ధమైన ప్రక్రియ ద్వారానే నిర్మించామని ఆయన గుర్తు చేశారు. 500 ఏళ్ల కల సాకారమైనందుకు దేశ ప్రజలంతా దీపావళి జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఇవాళ రాత్రికి ప్రతి ఇంట్లో దీపాలు వెలగాలని పిలుపునిచ్చారు.
ఈ క్షణం దేశ ప్రజల సహనానికి నిదర్శనం
‘‘ఇవాళ మన రాముడు మళ్లీ వచ్చాడు. 2024 జనవరి 22 సాధారణ తేదీ కాదు. ఇది కొత్త కాలచక్రానికి ప్రతీక. ఇది కాలచక్రంలో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుత సమయం. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కావడం నా అదృష్టం. నా మనస్సంతా బాలరాముడి రూపంపైనే ఉంది’’ అని ప్రధాని తెలిపారు. అయోధ్య రామమందిర నిర్మాణ కార్యం ఆలస్యమైనందుకు క్షమించాలని రాముడిని వేడుకుంటున్నట్లు చెప్పారు. ‘‘రాముడు 14 ఏళ్లు వనవాసం చేశాడు. కానీ అయోధ్య వాసులు 5 శతాబ్దాలుగా ఈ క్షణం కోసం వేచిచూస్తున్నారు. కొందరు వ్యక్తులు మన సమాజ ఆత్మను అర్ధం చేసుకోలేపోయారు. రాముడి ఆలయం వందల ఏళ్లుగా ఎందుకు నిర్మాణం కాలేదో దేశ ప్రజలు ఆలోచించాలి’’ అని ఆయన కోరారు. ‘‘ఈ క్షణం దేశ ప్రజల సహనం, పరిపక్వతకు నిదర్శనం. ఈ క్షణం మన విజయానికే కాదు.. మన వినయానికి కూడా సూచిక’’ అని తెలిపారు.
రాముడు వివాదం కాదు .. సమాధానం
‘‘సాగర్ నుంచి సరయూ నదీ వరకు ప్రతీదీ రామ జపం చేస్తోంది. రామ నామం.. దేశ ప్రజల ప్రతి కణకణంలో ఉంది. రాముడు వివాదం కాదు….రాముడు సమాధానం. రాముడు నిత్యం…రాముడు నిరంతరం…రాముడు అనంతం. మన దేశ సంస్కృతి, కట్టుబాట్లకు రాముడే మూలం. రాముడి ఆదర్శం, విలువలు, క్రమశిక్షణ మనకు శిరోధార్యం’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘రాముడు భారత దేశ ఆత్మ. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. ఈ సమయానికి పరిపూర్ణ దివ్యత్వం ఉంటుంది. పవిత్ర అయోధ్యాపురికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను’’ అని మోడీ పేర్కొన్నారు. ఈ శుభ ఘడియల కోసం తాను 11 రోజుల దీక్ష పాటించడంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అయోధ్య రామయ్యను దేశ ప్రజలందరూ దర్శించుకోవాలని ప్రధాని కోరారు.