అయోధ్య గర్భగుడిలో ప్రధాని మోడీ తొలి పూజ

by Mahesh |
అయోధ్య గర్భగుడిలో ప్రధాని మోడీ తొలి పూజ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన ఆలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ట పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో పండితులు ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రాణప్రతిష్ట‌కు ముందు ఆలయ గర్భగుడి వద్దకు చేరుకున్న మోడీతో ప్రాణ ప్రతిష్ట పూజ కోసం పూజారులు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పూజలు ప్రారంభించగా.. రామ్‌లల్లా కళ్లకు గంతలు తొలగించిన మోడీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. అనంతరం ప్రధాని గర్భగుడిలో తొలి పూజ చేశారు.

ఈ వేడుకకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, సీఎం యోగీ ఆదిత్యనాథ్ హాజరయ్యారు. అంతకుముందు 10.25 గంటలకు అయోధ్య నగరానికి వచ్చిన ప్రధాని మోడీ 12 గంటలకు ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు. దీంతో మోడీతో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం 12:05 గంటలకు గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమై 12:55 వరకు ముగిశాయి. పవిత్రోత్సవం జరుగుతున్న సమయంలో హెలికాప్టర్లతో రామాలయ ప్రాంగణంలో పూలవర్షం కురిపించారు.

ప్రతీ క్షణం ఒక అద్బుతం: ప్రధాని మోడీ

‘అయోధ్య మందిరం లో రామ్ లల్లా జీవితానికి అంకితం చేయబడిన ప్రతీ క్షణం ఒక అద్బుతం. ఇది ప్రతి ఒక్కరినీ బావోద్వేగానికి గురి చేస్తుంది.ఈ కార్యక్రమంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉంది’ అని మోడీ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed