- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో వరుస ఈ ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఈమె కేవలం హీరోయిన్ మాత్రమే కాదు సింగర్ కూడా. ఇక ఈమె వాయిస్‌కి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఇక రీసెంట్‌గా ప్రభాస్ సరసన ‘సలార్’ మూవీలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ పాన్ ఇండియా సినిమాలైన ‘సలార్-2’, ‘కూలీ’ వంటి చిత్రాలతో మనముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఈ భామ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తన వ్యక్తిగత లైఫ్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఆమె మాట్లాడుతూ.. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని విధంగా మార్పులు జరుగుతుంటాయి. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా..! నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను. రొమాంటిక్‌గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉండేవారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా సరే నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. నా స్నేహితులు, బంధువులు ఎంతో మంది వివాహానంతరం చాలా సంతోషంగా ఉన్నారు’ అంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.-