- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీరాముడిపై భక్తి.. బంగారంతో అతి సూక్ష్మ రామబాణం తయారీ
దిశ, వెబ్‌డెస్క్ : దేశమంతా రామనామంతో మార్మోగుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘జై శ్రీరాం’ అంటూ ప్రతిధ్వనిస్తోంది. నేడు అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఇవాళ విద్యాసంస్థలకు సెలవు కూడా ప్రకటించడంతో కుటుంబ సమేతంగా ఆలయాలకు భక్తులు పొటెత్తారు. ప్రజలు సైతం ఇంట్లోనే కూర్చోని అయోధ్య లైవ్‌ని వీక్షిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్, అల్వాల్‌కు చెందిన సూక్ష్మకళాకారుడు పూన ప్రదీప్ శ్రీరాముడిపై తన ఉడుత భక్తిని చాటుకున్నాడు. ఎంతో కష్టపడి రాగి ఆకుపై శ్రీరాముడి ప్రతిమలను చెక్కాడు. అంతే కాదు.. కేవలం 60 నిమిషాల్లోనే 0.030 మిల్లీగ్రాముల సూక్ష్మ బంగారు రామబాణాన్ని తయారు చేశాడు. ముత్యంపై బంగారంతో ‘జై శ్రీరాం’ అక్షరాలను చెక్కి ఔరా అనిపించాడు. పూన ప్రదీప్‌కు శ్రీరాముడిపై ఉన్న భక్తిని చూసిన పలువురు ఆయనను అభినందిస్తున్నారు.