అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ సంచలనం.. ముస్లిం బిడ్డకు రాముడి పేరు

by GSrikanth |
అయోధ్య ప్రాణప్రతిష్ట వేళ సంచలనం.. ముస్లిం బిడ్డకు రాముడి పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యంత అట్టహాసంగా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం జరిగింది. వందల ఏళ్ల నాటి అక్కడి ప్రజల కల నెరవేరడంతో అయోధ్య పట్టణ రూపురేఖలు మారిపోయాయి. ఈ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది ప్రముఖులు పాల్గొనడంతో ఎటు చూసినా పండుగ వాతావరణం చోటుచేసుకుంది. ప్రాణప్రతిష్ట అనంతరం ఈ మహత్తర ఘట్టం గురించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఇదిలా ఉండగా.. ప్రాణప్రతిష్ట వేళ దేశంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

దేశ వ్యాప్తంగా ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులంతా అయోధ్యలో రాముడు కొలువు దీరనున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని థానే పట్టణానికి చెందిన ఓ ముస్లిం మహిళ.. తనకు పుట్టిన బిడ్డకు హిందూ, ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు రెండు కలిపి పెట్టింది. ఆ పుట్టిన బిడ్డకు రాముడు, రహీం పేర్లు కలిసి వచ్చేలా రామ్ రహీం అని నామకరణం చేసింది. ఒక్క అయోధ్యలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఇవా వేల సంఖ్యలో ఇలా ప్రసవాలు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, సదరు ముస్లిం మహిళపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed