- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణప్రతిష్ఠ రోజు సెలవు ఇవ్వండి.. ‘సుప్రీం’ చీఫ్ జస్టిస్‌కు బార్ కౌన్సిల్ రిక్వెస్ట్
దిశ, డైనమిక్ బ్యూరో : రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా అన్ని కోర్టులకు సెలవు ప్రకటించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు భారత బార్ కౌన్సిల్ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు ఆ రోజు వారివారికి అనువైన చోట రామమందిరంలో రాముడి ప్రాణప్రతిష్ఠ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు వీలుగా ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్ అధ్యక్షుడు మానం కుమార్ మిశ్రా రిక్వెస్టు చేశారు. ఆ రోజు ప్రధాని మోడీ స్వయంగా అయోధ్యలో పాల్గొంటున్నారని, దేశ విదేశాల నుంచి వేలాది మంది అతిథులు వస్తున్నారని, రామ భక్తులుగా ఉండే పలువురు లాయర్లు సైతం ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ఆసక్తిగా ఉన్నారని వివరించారు. విశ్వాసానికి సంబంధించిన అంశమన్నారు. దేశవ్యాప్తంగానే సంచలనం సృష్టించిన రామమందిరం పిటిషన్ కేసు విచారణ అనంతరం 2019 నవంబరు 9న ఇదే సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించిందని గుర్తుచేశారు.