TVS Jupiter 110 : మార్కెట్లో TVS జూపిటర్ కొత్త మోడల్.. ఫీచర్స్ చూస్తే అదుర్స్..

by Sumithra |
TVS Jupiter 110 : మార్కెట్లో TVS జూపిటర్ కొత్త మోడల్.. ఫీచర్స్ చూస్తే అదుర్స్..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : స్కూటీ ప్రియులకు గుడ్ న్యూస్. మార్కెట్లోకి సరికొత్త మోడల్ లో TVS జూపిటర్ 110 అందుబాటులోకి వచ్చేసింది. దాని కూల్ లుక్స్, మంచి ఫీచర్లతో పాటు సరసమైన ధరతో ఇతర స్కూటర్ కంపెనీలకు పోటీగా నిలవనుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త జూపిటర్ 110 ధరను గత వారం వెల్లడించిన విషయం తెలిసిందే. మరి ఈ కొత్త TVS జూపిటర్ 110 గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

వేరియంట్లు, ధర, రంగు..

కొత్త TVS జూపిటర్ 110ని మొత్తం 4 వేరియంట్లలో విడుదల చేశారు. బేస్ మోడల్ జూపిటర్ 110 డ్రమ్ వేరియంట్ ధర రూ.73,700. కాగా, జూపిటర్ డ్రమ్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.79,200. జూపిటర్ డ్రమ్ స్మార్ట్‌కనెక్ట్ వేరియంట్ ధర రూ. 83,250. అలాగే టాప్ మోడల్ టీవీఎస్ జూపిటర్ డిస్క్ స్మార్ట్‌కనెక్ట్ ధర రూ.87,250. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే. కొత్త జూపిటర్ డాన్ బ్లూ మ్యాట్, గెలాక్టిక్ కాపర్ మ్యాట్, టైటానియం గ్రే మ్యాట్, స్టార్‌లైట్ బ్లూ గ్లోస్, లూనార్ వైట్ గ్లోస్, మెటోర్ రెడ్ గ్లోస్ వంటి 6 కలర్ ఆప్షన్‌లలో కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి.

మంచి డిజైన్..

కొత్త స్కూటర్ TVS జూపిటర్ 110 ఎర్గోనామిక్స్‌తో రూపొందించారు. ఈ స్కూటీలో హ్యాండిల్‌బార్, విశాలమైన ఫ్లోర్‌బోర్డ్, మంచి హైట్ లో సౌకర్యవంతమైన సీట్ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. స్టైలిష్ పియానో ​​బ్లాక్ ఫినిషింగ్, సిగ్నేచర్ ఇన్ఫినిటీ లైట్లు ఈ స్కూటర్‌కు అందాన్ని పెంచాయి. అలాగే స్మార్ట్ అలర్ట్‌లు, యావరేజ్, రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్‌తో కూడిన పూర్తి డిజిటల్ కలర్ ఎల్‌సీడీ స్పీడోమీటర్ మంచి లుక్ ఇచ్చాయి.

TVS జూపిటర్ 110 భద్రతా ప్రమాణాలు..

TVS మోటార్ కంపెనీ కొత్త స్కూటర్ జూపిటర్ 110 మంచి భద్రత, ఫీచర్లు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్రంట్ ఫెండర్, MetalMax కింద సైడ్ ప్యానెల్‌లు ఉన్నాయి. దీనితో పాటు డ్యూయల్ హెల్మెట్ స్పేస్, ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్, టర్న్ సిగ్నల్ ల్యాంప్ రీసెట్, ఫాలో మీ హెడ్‌ల్యాంప్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

ఫీచర్స్..

సరికొత్త TVS జూపిటర్ 110 పెద్ద గ్లోవ్ బాక్స్, ఫ్రంట్ ఫ్యూయల్ ఫిల్, లాంగ్ సీట్, ఆల్-ఇన్-వన్ లాక్, USB మొబైల్ ఛార్జర్, పేటెంట్ పొందిన E-Z సెంటర్ స్టాండ్‌తో సహా సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ల హోస్ట్‌తో వస్తుంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్‌లు, మోటార్‌సైకిల్ లాంటి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, పెద్ద 90/90-12 అంగుళాల టైర్లు ఉన్నాయి. ఈ స్కూటర్ బాడీ బ్యాలెన్స్ టెక్నాలజీ 2.0 ఉంది.

Advertisement

Next Story

Most Viewed