- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత మార్కెట్లో ఇటాలియన్ లగ్జరీ కార్.. ధర తెలిస్తే షాక్..
దిశ, వెబ్‌డెస్క్ : ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మసెరటి టాప్ 10 గ్లోబల్ మార్కెట్లలో భారత్ ఒకటని భావించింది. భారత్ లోనూ తన వ్యాపారాన్ని విస్తరిస్తుంది. విదేశీ మార్కెట్ హెడ్ ఫిలిప్ క్లావెరోల్ తన కొత్త సూపర్ కార్ మసెరటి గ్రాన్ టురిస్మో మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర విషయానికి వస్తే రూ. 2.72 కోట్ల ఎక్స్-షోరూమ్ గా ఉంది. మసెరటి రాబోయే కాలంలో భారత్ లో తన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) సిరీస్‌ను పరిచయం చేయడానికి సిద్ధమవుతోంది.
త్వరలో మసెరటి ఎలక్ట్రిక్ కార్లు..
క్లావెరోల్ PTIతో మాట్లాడుతూ మసెరటి ఒక విలాసవంతమైన బ్రాండ్ అని తెలిపారు. అందుకే ఎక్కువ వాల్యూమ్‌ను ఆశించడం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏడాది ఈ సంస్థ 500 కార్లను విక్రయించే పెద్ద మార్కెట్ అని, రాబోయే కొన్నేళ్లలో భారతదేశంలో ప్రతి సంవత్సరం 500 లగ్జరీ కార్లను విక్రయించే స్థాయికి చేరుకోగలమని భావిస్తున్నానన్నారు. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు.
అనంతరం సీనియర్ మసెరటి ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ రాబోయే కొద్ది సంవత్సరాలలో మసెరటికి సంబంధించిన టాప్ 10 మార్కెట్లలో భారతదేశం ఒకటిగా మారుతుందని తాను భావిస్తున్నానన్నారు. ప్రస్తుతం ఉత్తర అమెరికా, ఇటలీ, స్విట్జర్లాండ్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మసెరటికి అగ్ర ప్రపంచ మార్కెట్‌లు అన్నారు. గతేడాది భారత్ లో 50లోపే వాహనాలు అమ్ముడయ్యాయన్నారు. మసెరటి అమ్మకాలకు భారతదేశం కూడా మంచి మార్కెట్ అని క్లావెరోల్ చెప్పారు. భారతదేశంలోని తమ కస్టమర్లలో ఎక్కువ మంది (80 శాతం) వ్యవస్థాపకులు అన్నారు.