- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్‌లో ఒకే రోజు 9,996 కరోనా కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఒక్కరోజులో తొమ్మిది వేలకుపైగా కేసులు నమోదవడం సాధారణమైపోయింది. గురువారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ వెల్లడించే సమయానికి గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 2,86,579కి చేరాయి. ఒక్కరోజే కరోనాతో 357 మంది చనిపోగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 8102 మంది వ్యాధితో మరణించారు. ఇప్పటివరకు 1,41,029 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 1,37,448 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా మొత్తం కేసుల్లో దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో కొనసాగుతుండగా తాజాగా నమోదైన కేసులతో యూకేకు అతి చేరువగా వెళ్లింది. మరణాల్లో కెనడాను దాటి 11 వ స్థానానికి చేరింది.
దేశంలో కరోనా కేసులు చైనాతో పోలిస్తే నాలుగు రెట్లు అయ్యే దిశగా వెళుతున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 3607పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 97,648కి చేరింది. దేశంలోని ఒక్క మహారాష్ట్రలో నమోదైన కేసులే చైనాలో మొత్తం కేసులను దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక్కడే మరో 152 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో 1540 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఒక్కరోజే 97 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 53,985కి చేరింది. తమిళనాడులో 1875 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య38,716కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 23 మంది మరణించడంతో ఇక్కడ ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 349కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 1877 కేసులు నమోదుకాగా ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 34687కు చేరింది. ఢిల్లీలో కరోనా బారిన పడి ఒక్కరోజే 65 మంది మరణించడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1085కు చేరింది. గుజరాత్‌లో ఒక్కరోజే 513కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య22,067కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 38 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1313కు చేరింది. ఏపీలో 24 గంటల్లో కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4261కి చేరింది. ఇక్కడ ప్రస్తుతం 1641 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 80 మంది మరణించారు.