కరోనాను జయించిన 93 ఏళ్ల బామ్మ

by vinod kumar |
కరోనాను జయించిన 93 ఏళ్ల బామ్మ
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏమాత్రం అప్రమత్తంగా లేపోయినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వైద్యులు పదేపదే సూచనలు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు వృద్ధులు వైరస్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు. వృద్ధులకు వైరస్ సోకితే తట్టుకోవడం కష్టమే అని చెబుతున్నారు. కానీ అందరి అంచనాలను పటాపంచలు చేసిన ఓ బామ్మ కరోనాను జయించింది. ఉత్తరాఖండ్‌‌‌ హెచ్‌ఎన్బీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జంతు విజ్ఞాన విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బీఎస్ బిస్ట్ తల్లి సుర్జీదేవి(93) దగ్గు ఇతరత్రా అనారోగ్య సమస్యలతో జిల్లా ఆసుపత్రిలో చేరారు. దీంతో మొదటగా వైద్యులు ఆమెకు కరోనా టెస్టులు చేశారు. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ వృద్ధురాలిని కోవిడ్ వార్డుకు తరలించి చికిత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ అధికారి అరుణ్ బడోనీ మాట్లాడుతూ.. డిసెంబరు 16 నుంచి ఆమెకు చికిత్స ప్రారంభించామని, డిసెంబరు 30 నాటికి ఆమె కరోనా నుంచి కోలుకుందని ఆమెకు నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంటికి పంపించామన్నారు.

Advertisement

Next Story

Most Viewed