యువతకు ఆదర్శంగా నిలుస్తున్న.. 96 ఏళ్ల వృద్ధుడు

by Sridhar Babu |
యువతకు ఆదర్శంగా నిలుస్తున్న.. 96 ఏళ్ల వృద్ధుడు
X

దిశ, వేములవాడ: కరోనా సోకితే చాలు.. తాను చనిపోతాననీ భయంతో నే చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. కరోనా కంటే భయమే మనిషిని చంపేస్తుంది. ఇలాంటి సమయంలో 96 ఏళ్ల వృద్ధుడు కరోనా తో పోరాటం చేసి, జయించాడు. కరోనా తో పోరాటం చేసే యువతకు ఆదర్శం గా నిలుస్తున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపళ్లి గ్రామానికి చెందిన విక్కుర్తి నర్సయ్య కు 96 ఏళ్ళు. ఈ మధ్య బంధువుల ఇంటికి పండుగకు వెళ్లిన నర్సయ్య తో పాటు తన ఇద్దరు కొడుకులకు కరోనా సోకింది. దీంతో వైద్యుల సలహా మేరకు మందులు ఇంటి వద్దనే తీసుకున్నారు. అయినా నర్సయ్య కు శ్వాస తీసుకోవడం ఇబ్బంది కావడంతో సర్కారు దవాఖానా కు పోయిన బెడ్లూ ఖాళీ లేవని,ఇంటి వద్దనే 15 రోజులు ఉండి చికిత్స తీసుకున్నాడు. దీంతో నర్సయ్య కరోనా నుంచి కోలుకున్నాడు. కరోనా ను జయించిన నర్సయ్య పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన కొడుకులు కంటే ముందే నర్సయ్య కోలుకోవడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed