- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ,మణుగూరు : పినపాక నియోజక వర్గంలోని అశ్వాపురం మండలం మెండికుంట గ్రామపరిధిలో 90కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామంలో ఏఎస్సై కే.నాగేశ్వరరావు ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ఇన్నోవా MH 49 U 3066 అనే వాహనం అనుమానస్పదంగా కనిపించడంతో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. ఈవాహనంలో 90కేజీల గంజాయితో పాటు మహమ్మద్ సబీర్,మహమ్మద్ మరియం, మహమ్మద్ తొఫీక్ ఖాన్,సోని సుమిత్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
వీరితో పాటు 70150 రూపాయలు,3 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. అనంతరం వీరిని అరెస్టు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. అనంతరం ఏఎస్సై వివరాల ప్రకారం 90కేజీల గంజాయిని ఒడిశా నుంచి ఢిల్లీ తరలిస్తున్నారని తెలిపారు. ఈగంజాయి సుమారు విలువ 18లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఎంతటివారైనా సరే అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదన్నారు. అనంతరం సిఐ భానుప్రకాశ్, ఏఎస్సై కే.నాగేశ్వరరావును, సిబ్బందిని మణుగూరు ఏఎస్పీ శబరిష్ అభినందించారు.