- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > DJ కోసం SI కు ఎదురెళ్లిన బుడ్డోడు.. మేం హ్యాపీగా పండుగ చేసుకోవద్దా అంటూ ప్రశ్న..(వైరల్)
DJ కోసం SI కు ఎదురెళ్లిన బుడ్డోడు.. మేం హ్యాపీగా పండుగ చేసుకోవద్దా అంటూ ప్రశ్న..(వైరల్)
by Sridhar Babu |
X
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహం నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నిర్వాహకులు, పట్టణ ప్రజలు డీజే సౌండ్ పెట్టి ఉత్సాహంగా ఊరేగింపు నిర్వహిస్తుండగా పట్టణ పోలీసులు అడ్డుకొని డీజేకు అనుమతి లేదని నిలిపివేశారు.
దీంతో పట్టణంలోని పాతకేరికి చెందిన 8 సంవత్సరాల బాలుడు సంజీవ్ పట్టణ ఎస్ఐతో డీజేను పెట్టించాలని కోరాడు. అందరి మధ్యన నిలబడి ఎస్ఐతో ఇప్పుడు డీజే పెట్టించండి సారూ.. ఏమైనా ఉంటే నిమజ్జనం తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే ఏం మీటింగులు వద్దు, సంతోషంగా పండుగలు కూడా జరుపుకోవద్దా అంకుల్ అంటూ బుడతడు ధైర్యంగా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచడమే కాకుండా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతానికి ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
Advertisement
Next Story