అసలు రేషన్ కార్డులనే ఏరేశారు?

by  |
అసలు రేషన్ కార్డులనే ఏరేశారు?
X

దిశ, వెబ్‌డెస్క్ : జార్ఖండ్‌లో మూడేళ్ల కింద అప్పటి బీజేపీ ప్రభుత్వం చేపట్టిన నకిలీ రేషన్ కార్డు ఏరివేతలపై పలుఅనుమానాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. 2016-18 మధ్య చేపట్టిన నకిలీ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియపై చేసిన సర్వే ఆందోళనకర విషయాలను వెలుగులోకి తెచ్చింది. నోబెల్ గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, ఎస్తర్ దుఫ్లోలు సహవ్యవస్థాపకులుగా ఉన్న అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్(జే-పాల్) చేపట్టిన సర్వే ఆధారంగా ఆర్థిక వేత్తలు కార్తీక్ మురళీధరన్, పాల్ నియహస్, సందీప్ సుక్తంకర్‌లు కూర్చిన రిపోర్టు.. నకిలీ ఏరివేతల కన్నా అసలు రేషన్ కార్డులనే అధికంగా రద్దు చేసినట్టు వెల్లడించింది. జార్ఖండ్‌లోని పదిజిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. ర్యాండమ్‌గా రేషన్ కార్డుల డేటాను పరిశీలించగా.. రద్దు చేసిన వాటిలో సుమారు 88శాతం వాస్తవ (జెన్యూన్) రేషన్ కార్డలే ఉన్నాయని ఈ రిపోర్టు తేల్చింది. జే-పాల్ శాంపిల్ సర్వేలో భాగంగా పది జిల్లాల్లో 3,901 రేషన్ కార్డుల డేటాను పరిశీలించగా.. అందులో 88 శాతం కార్డులు అసలు రేషన్ కార్డులేనని, కేవలం 12శాతం మాత్రమే నకిలీ రేషన్ కార్డులున్నట్టు తెలిసింది. దాదాపుగా అదే రేషన్ కార్డలు ఏరివేత కాలంలో 18 మంది ఆకలితో చనిపోయినట్టు సామాజిక కార్యకర్తలు తెలిపారు. కానీ, ఆ వాదనలను అప్పటి బీజేపీ సర్కారు తోసిపుచ్చింది.

Next Story

Most Viewed