వెండితెరపైనే ‘83’

by Jakkula Samataha |
వెండితెరపైనే ‘83’
X

దిశ వెబ్ డెస్క్ : బాలీవుడ్ లో వస్తున్న ఆసక్తికరమైన చిత్రాల్లో ‘83’ఒకటి. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లోనే 1983 ప్ర‌పంచ‌క‌ప్ విజ‌యం ప్ర‌త్యేకంగా నిలిచిపోతుంది. ఆ గెలుపు తర్వాతే టీమీండియాకు ఎనలేని ఆదరణ పెరిగింది. వరల్డ్ కప్ విజయం ఆధారంగా తెరకెక్కుతున్న 83 చిత్రంలో.. కపిల్ దేవ్ రణ్ వీర్ సింగ్ నటించిన విషయం తెలిసిందే. కపిల్ దేవ్ భార్య రోమీ భాటియా పాత్రలో దీపికా పదుకుణే కనిపించనుంది. ఏప్రిల్ 10 న రావాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా విడుదల కాలేదు. ఈ నేప‌థ్యంలో ‘83’ సినిమాకు ఒక వెబ్ స్ట్రీమింగ్ యాప్ వాళ్లు 144 కోట్ల రూపాయ‌ల మొత్తాన్ని ఆఫ‌ర్ చేసి ఆ సినిమాను కొనుగోలు చేయ‌డానికి రెడీ అయ్యారని, త్వరలోనే ఓటీటీ వేదికగా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వచ్చాయి. వాటిపై దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.

క్రికెట్ చరిత్రలోనే ‘1983 ప్రపంచకప్’ కు ప్రత్యేక స్థానముంది. ఆ తర్వాత మళ్లీ టీమీడింయా ప్రపంచకప్ గెలవడానికి 28 ఏళ్లు పట్టింది. భారత జట్టు తొలిసారి గెలుచుకున్న ప్రపంచకప్ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘83’ కావడంతో ప్రేక్షకుల్లో, క్రీడా ప్రేమికుల్లో ఆ సినిమాపై భారీగానే ఆశలున్నాయి. సినీ నిర్మాతలు కూడా సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. క‌రోనా లాక్ డౌన్ లేక‌పోయి ఉంటే.. ఈ పాటికి ఆ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేదే. అయితే ఇప్పుడ‌ప్పుడే ఆ అవ‌కాశం లేకపోవడంతో డిజిటల్ ప్లాట్ ఫాంపై సినిమా విడుదల చేయనున్నారంటూ వస్తున్న వార్తలపై చిత్ర బృందం స్పందించింది. ఆ వార్తల్లో వాస్తవం లేదని, సినిమాను థియేటర్లోనే విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితిని చూసి సినిమా విడుదలపై ఓ నిర్ణయానికి వస్తామని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా, రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్స్, ఫాంటోమ్ ఫిల్మ్స్, నదియాద్ వాలా గ్రాండ్సన్ ఎంటర్ టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రీతమ్ చక్రవర్తి, జులియస్ పకియమ్ సంగీతమందించారు.

Tags : bollywood, 83, worldcup, ranveer singh, deepika padukone

Advertisement

Next Story

Most Viewed