- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డి జిల్లావాసులకు గుడ్ న్యూస్..
దిశ, సంగారెడ్డి : జిల్లాలో ఈనెల 26 నుంచి కొత్త ఆహార భద్రత కార్డులను (రేషన్ కార్డులు) లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం తెలిపారు. జిల్లాలో కొత్తగా 8,139 మంది లబ్దిదారులను గుర్తించామన్నారు. ఆహార భద్రత కార్డుల కోసం 11,281 దరఖాస్తులు వచ్చాయని, వివిధ స్థాయిల్లో పరిశీలన అనంతరం 8,139 మంది అర్హులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఈ నెల 26 నుంచి లబ్ధిదారులకు సంబంధిత శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆహార భద్రత కొత్త కార్డులను పంపిణీ చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. నూతన కార్డులు పొందిన లబ్ధిదారులు ఆగస్టు మాసం నుంచి చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ పొందవచ్చని తెలిపారు. ఆయా రెవిన్యూ డివిజనల్ అధికారుల పర్యవేక్షణలో, మండల తహసీల్దార్ల ఆధ్వర్యంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆయా మండలాల్లో పంపిణీ సమయంలో కార్డు తీసుకోని లబ్ధిదారులు తమ ఆధార్ నెంబర్‌తో మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆహారభద్రత కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
అందోల్ నియోజకవర్గానికి 1,233 కార్డులు మంజూరయ్యాయని, అందులో మండలాల వారీగా అందోల్ మండలానికి 301, చౌటకూర్ 120, మునిపల్లి 222, పుల్కల్ 152, రాయికోడ్ 239, వట్ పల్లి 199 మంజారీ అయినట్లు తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గానికి మొత్తం 1,288 కాగా కల్హేర్ మండలానికి 226, కంగ్తి 299, మనూర్ 146, నాగలి గిద్ద 166, నారాయణఖేడ్ 298, సిర్గాపూర్ 153 , పటాన్‌చెరు నియోజకవర్గానికి మొత్తం 2,022 కాగా అమీన్పూర్ 230, గుమ్మడిదల 275, జిన్నారం 551, పటాన్‌చెరు 757, రామచంద్రపురం 209, సంగారెడ్డి నియోజకవర్గానికి మొత్తం 1,382 కాగా కంది మండలానికి 156, కొండాపూర్ 154, సదాశివ్ పేట్ 460, సంగారెడ్డి 612 మంజూరైనట్లు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గానికి 1,819 కాగా, ఝరాసంఘం మండలానికి 237, కోహీర్ 270, మొగుడంపల్లి 179, న్యాల్కల్ 467, జహీరాబాద్ 666 కార్డులు మంజూరు అయ్యాయని, నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలానికి 395 మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు. లబ్ధిదారులు తమ మండలంలో ఆయా తేదీల్లో పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్డులు పొందాలని కలెక్టర్ హనుమంతరావు కోరారు.
- Tags
- Ration cards