81శాతం కొత్త కేసులు యూకే స్ట్రెయిన్‌‌లే!

by Anukaran |   ( Updated:2021-03-23 05:13:41.0  )
81శాతం కొత్త కేసులు యూకే స్ట్రెయిన్‌‌లే!
X

దిశ,వెబ్ డెస్క్:పంజాబ్‌లో భారీగా నమోదవుతున్న కొత్త కేసులు కలకలం రేపుతున్నాయి. మహారాష్ట్ర తర్వాత అత్యధిక కేసులు ఇక్కడే నమోదవుతున్నాయి. కొత్త కేసుల్లోనూ వేగంగా వ్యాప్తి చెందే కొత్తరకం వైరస్‌ కేసులు కలవరపెడుతున్నాయి. పంజాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపిన 401 కేసుల్లో 81శాతం కొత్త కేసులు యూకే స్ట్రెయిన్(బీ117) కేసులేనని తేలాయి. చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ కంటే యూకే స్ట్రెయిన్ కరోనా వైరస్ 70శాతం వేగంగా ఇతరులకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్ట్రెయిన్‌ను నిలువరించే సామర్థ్యం కొవిషీల్డ్(ఆస్ట్రా జెనెకా)కు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులు చేజారకముందే ఎక్కువమందికి టీకా పంపిణీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. 60ఏళ్లలోపువారికీ టీకా పంపిణీ చేయాలని, యూకే స్ట్రెయిన్ ఎక్కువగా యువతలోనూ ప్రబలంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు. స్ట్రెయిన్ చైన్‌ను అడ్డుకోవాలంటే 60ఏళ్లలోపువారికీ వేగంగా టీకా పంపిణీ చేయాలని సూచించారు.

మరిన్ని ఆంక్షలు: సీఎం హెచ్చరిక

చైనా నుంచి వ్యాపించిన కరోనా వైరస్ కంటే యూకే స్ట్రెయిన్ కరోనా వైరస్ 70శాతం వేగంగా ఇతరులకు సోకే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ స్ట్రెయిన్‌ను నిలువరించే సామర్థ్యం కొవిషీల్డ్(ఆస్ట్రా జెనెకా)కు ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చారు. ఈ నేపథ్యంలోనే కరోనా పరిస్థితులు చేజారకముందే ఎక్కువమందికి టీకా పంపిణీ చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కోరారు. 60ఏళ్లలోపువారికీ టీకా పంపిణీ చేయాలని, యూకే స్ట్రెయిన్ ఎక్కువగా యువతలోనూ ప్రబలంగా వ్యాప్తి చెందుతున్నదని తెలిపారు.

స్ట్రెయిన్ చైన్‌ను అడ్డుకోవాలంటే 60ఏళ్లలోపువారికీ వేగంగా టీకా పంపిణీ చేయాలని సూచించారు. అలాగే ప్రజలూ అప్రమత్తంగా మెలగాలని, కరోనా నిబంధనలను తప్పక పాటించాలని తెలిపారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటివి కచ్చితంగా అనుసరించాలని అభ్యర్థించారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆంక్షలు విధించారు. కరోనా నిబంధనలు ప్రజలు ఖాతరు చేయకుంటే మరిన్ని ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed