టీకా తీసుకోలేదన్న కారణంతో 800 మంది ఉద్యోగులు సస్పెండ్

by Shamantha N |   ( Updated:2021-11-03 07:14:38.0  )
టీకా తీసుకోలేదన్న కారణంతో 800 మంది ఉద్యోగులు సస్పెండ్
X

దిశ, వెబ్‌డెస్క్: అతిపెద్ద కెనడియన్ ఎయిర్‌లైన్ అయిన ఎయిర్ కెనడా సంస్థ కరోనా టీకాలు వేయించుకోని 800 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా బుధవారం వెళ్లడించింది. అక్టోబర్‌లో కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో అక్టోబర్ 30 నాటికి ఎయిర్, రైలు, షిప్పింగ్ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులు టీకా తీసుకునేలా చూడాలని ఆ సంస్థలను ఆదేశించారు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్‌ లో పనిచేస్తున్న ఉద్యోగులకు టీకా వేయించుకోవడం తప్పనిసరి అయింది. ఇందుకు గల కారణం వారు ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లి రావటం. ఈ నిబంధనలు అందులోనే పనిచేస్తున్న కొందరి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు కలిగించారు.

ఎయిర్ కెనడాలోని లెక్కల ప్రకారం 27,000 మంది క్యాబిన్ సిబ్బంది, కస్టమర్ సర్వీస్ ఏజెంట్లు, ఇలా చాలామంది రెండు డోసులు తీసుకున్నారని కంపెనీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైఖేల్ రస్సో చెప్పారు. మా ఉద్యోగుల్లో ఇప్పటివరకు 96 శాతం మంది స్వచ్చందంగా టీకా తీసుకున్నారని అన్నారు. ఇంతవరకు టీకా తీసుకున్న ఉద్యోగులను, ఆరోగ్య సమస్యలు ఉండి టీకాలు మినహాయింపు సర్టిఫికేట్ లేని ఉద్యోగులను, వేతనం లేని సెలవుపై ఉంచామనని జాతీయ మీడియా ముందు రూసో చెప్పారు.

Advertisement

Next Story