- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మత్తెక్కిస్తున్న ఏపీ.. 800 ఎకరాల్లో గంజాయి తోట ధ్వంసం
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది. గంజాయి రవాణాను అరికట్టేందుకు అటు తెలంగాణ అధికారులు ఏపీతో సరిహద్దు పంచుకుంటున్న జిల్లాల్లో విస్తృతంగా తనిఖీలు జరుపుతుండగా.. ప్రస్తుతం ఏపీ పోలీసులు కూడా నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇటీవలి కాలంలో గంజాయి స్మగ్లింగ్ భారీగా విస్తరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్‌ఈబీ కమిషనర్, తన బృందాలతో కలిసి దాడులు నిర్వహించారు.
ఏకంగా 800 ఎకరాల్లో విస్తరించిన ఉన్న గంజాయి వనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్‌లో 80టీములు పాల్గొన్నాయని ఆయన వివరించారు. గంజాయి సాగును ధ్వంసం చేయడానికి గిరిజనులు కూడా తమకు సహకరించినట్టు ఎస్‌ఈబీ కమిషనర్ వెల్లడించారు. కాగా, పొలిటికల్ లీడర్ల ప్రమేయంతోనే ఏపీలో భారీగా గంజాయి పంటను సాగు చేస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే.